rashi khanna: అవకాశం వస్తే నాలో ఉన్న మరో యాంగిల్ చూపిస్తా: రాశి ఖన్నా

  • నాలో ఉన్న కమెడియన్ ఇంకా బయటకు రాలేదు
  • పోటీ లేకపోతే ఎక్కడ ఉన్నామో అక్కడే ఆగిపోతాం
  • నేను, రెజీనా, లావణ్య, రకుల్ లు పోటీ పడి చేస్తాం

టాలీవుడ్ లో ఉన్న మల్టీ టాలెంటెడ్ యాక్టర్లలో రాశీ ఖన్నా కూడా ఒకరు. నటిగా మాత్రమే కాకుండా తీయనైన గొంతుతో ఆమె పాడి అలరించగలదు. అంతేకాదు, కవితలతో మెప్పించగలదు. అయితే, తనలో ఉన్న కమెడియన్ ఇంకా బయటకు రాలేదని... అవకాశం వస్తే తనలో ఉన్న ఆ యాంగిల్ ను కూడా ప్రదర్శించగలనని చెప్పింది.

ఏ పరిశ్రమలోనైనా పోటీ ఉంటుందని... ఒక మనిషి ఎదగాలన్నా, పడిపోవాలన్నా పోటీ ఉంటేనే సాధ్యమని రాశీ తెలిపింది. పోటీ లేకపోతే ఎక్కడున్నామో అక్కడే ఆగిపోతామని చెప్పింది. పోటీని తాను ఎప్పుడూ స్వీకరిస్తానని... అయితే పోటీ అనేది ఆరోగ్యకరంగా ఉండాలని తెలిపింది. తాను, తన ఫ్రెండ్స్ రెజీనా, లావణ్య, రకుల్ లు పోటీ పడి పని చేస్తామని... అయితే ఆ పోటీ ప్రొఫెషన్ వరకేనని చెప్పింది. షూటింగ్ పేకప్ అయిన తర్వాత తామంతా స్నేహితులమేనని తెలిపింది.

rashi khanna
takul preet
lavanya
regina
tollywood
  • Loading...

More Telugu News