Konda Surekha: మాపై దుష్ప్రచారం చేస్తున్నారు: ఢిల్లీలో కొండా సురేఖ

  • బేషరతుగా కాంగ్రెస్ లో చేరాం
  • రెండు, మూడు సీట్లు అడుగుతున్నామని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • మేము ప్రశ్నిస్తామనే భయంతోనే టీఆర్ఎస్ మమ్మల్ని పక్కన పెట్టింది

ఉత్తర తెలంగాణలో బలమైన నేతలైన కొండా దంపతులు సురేఖ, మురళిలు మళ్లీ సొంత గూటికి చేరారు. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ సమక్షంలో వారు ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన అనంతరం కొండా సురేఖ మాట్లాడుతూ, బేషరతుగా తాము కాంగ్రెస్ పార్టీలో చేరామని చెప్పారు. పార్టీ అధిష్ఠానం ఆదేశిస్తే రాష్ట్రమంతా తిరిగి, ప్రచారం నిర్వహిస్తామని తెలిపారు.

 టీఆర్ఎస్ నేతలు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని... తమ కుటుంబానికి రెండు, మూడు సీట్లు అడుగుతున్నామని అవాస్తవాలు చెబుతున్నారని అన్నారు. తమలాంటి బలమైన నేతలు పార్టీలో ఉంటే ప్రశ్నిస్తారనే భయంతోనే తమను టీఆర్ఎస్ పక్కన పెట్టిందని చెప్పారు. 

Konda Surekha
Rahul Gandhi
congress
  • Loading...

More Telugu News