Revanth Reddy: కమిటీ సూచనల మేరకే సంతకాలు చేశా: పోలీసులకు రేవంత్ రెడ్డి వివరణ

  • జూబ్లీహిల్స్ హౌసింగ్ సొసైటీ కేసు
  • ఏసీపీ కేఎస్ రావుకు వివరణ ఇచ్చిన రేవంత్
  • ప్లాట్ల విక్రయాల్లో తన పాత్ర లేదంటూ వివరణ

హైదరాబాద్ బంజారాహిల్స్ పోలీసుల ఎదుట కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హజరయ్యారు. జూబ్లీహిల్స్ కోఆపరేటివ్ హౌసింగ్ సొసైటీకి చెందిన ప్లాట్ల అక్రమ విక్రయాలకు పాల్పడ్డారన్న ఆరోపణలతో రేవంత్ పై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఆయన పోలీసుల ఎదుటకు వచ్చారు. నిన్న ఉదయం 10 గంటలకు పీఎస్ కు వచ్చిన రేవంత్... దాదాపు ముప్పావు గంట సేపు స్టేషన్ లో ఉన్నారు.

ఈ సందర్భంగా ఏసీపీ కేఎస్ రావుకు ఆయన వివరణ ఇచ్చారు. రానున్న పది రోజుల పాటు తాను హైదరాబాదులో ఉండటం లేదని... ఆ తర్వాత ఎప్పుడు విచారణకు పిలిచినా, హాజరవుతానని చెప్పారు. సొసైటీ ప్లాట్ల విక్రయాల్లో తన పాత్ర లేదని, ఆ కమిటీలో తాను కార్యవర్గ సభ్యుడిని మాత్రమేనని చెప్పారు. కమిటీ సూచనల మేరకే తాను సంతకాలు చేశానని తెలిపారు.

Revanth Reddy
jublee hills housing society
police
  • Loading...

More Telugu News