Laras: విశాఖలోని లారస్ ల్యాబ్ ఉత్పత్తుల నాణ్యతపై స్లోవేనియా కితాబు
- ప్రమాణాలు పాటిస్తున్నారని అక్కడి ఔషధ నియంత్రణ సంస్థ ధ్రువీకరణ
- దీంతో ఆ దేశానికి బల్క్‌డ్రగ్ ఎగుమతికి లైన్ క్లియర్
- ఆగస్టు 29న కంపెనీలో తనిఖీలు నిర్వహించిన సంస్థ
విశాఖ నగర పరిధి పరవాడ సెజ్‌లోని లారస్ ల్యాబొరేటరీ యూనిట్-2లో ఔషధ ఉత్పత్తి నాణ్యతా ప్రమాణాల మేరకు జరుగుతోందని స్లోవేనియా ఔషధ నియంత్రణ సంస్థ ధ్రువీకరించింది. బల్క్‌డ్రగ్, ఫిక్స్‌డ్ డోస్ ఫార్మేషన్‌కు సంబంధించి ఈ యూనిట్‌లో స్లోవేనియా ప్రతినిధులు ఆగస్టు 29న తనిఖీలు నిర్వహించారు. ఈ పరిశీలనపై ఆ దేశం ధ్రువీకరణ పత్రాన్ని అందించింది. మూడేళ్లపాటు ఈ ధ్రువీకరణ అమల్లో ఉంటుంది. దీనివల్ల లారస్ కంపెనీ తన ఉత్పత్తులను స్లోవేనియాతోపాటు ఇతర యూరప్ దేశాలకు ఎగుమతి చేసేందుకు మార్గం సుగమమైంది.