YSRCP: వైఎస్ జగన్ ను కలుసుకున్న సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి!

  • విజయనగరంలో జగన్ తో సమావేశం
  • ప్రతిపక్ష నేతకు సంఘీభావం ప్రకటించిన కృష్ణా రెడ్డి, అచ్చిరెడ్డి
  • 271వ రోజుకు చేరుకున్న ప్రజాసంకల్ప యాత్ర

ప్రజాసంకల్ప యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేత, వైసీపీ అధినేత వైఎస్ జగన్ విజయనగరం జిల్లాలో పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. నేడు ప్రజాసంకల్పయాత్ర 271వ రోజుకు చేరుకున్న నేపథ్యంలో ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణా రెడ్డి, నిర్మాత అచ్చిరెడ్డి జగన్ ను కలుసుకున్నారు. జగన్ ప్రజా సంకల్పయాత్రకు వీరిద్దరూ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా జగన్ వీరితో కొద్దిసేపు ముచ్చటించారు.

విజయనగరం జిల్లా, ఎస్‌కోట నియోజకవర్గం, కొత్తవలస మండలం దేశపాత్రునిపాలెం వద్ద సోమవారం జగన్ పాదయాత్ర 3,000 కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా భారీగా అక్కడకు చేరుకున్న పార్టీ కార్యకర్తలు, నేతల సమక్షంలో జగన్ పైలాన్ ను ఆవిష్కరించారు. 2017 నవంబర్ 6న కడప జిల్లా ఇడుపులపాయ నుంచి ప్రజాసంకల్ప యాత్ర ప్రారంభమైంది. 11 జిల్లాల మీదుగా ప్రయాణించి విజయనగరం జిల్లాలో ప్రస్తుతం కొనసాగుతోంది. ప్రజాసంకల్పయాత్ర 3 వేల కిలోమీటర్లు పూర్తిచేసుకున్న సందర్భంగా పైలాన్ ను ఆవిష్కరించిన జగన్.. పక్కనే రావి మొక్కను నాటారు.

YSRCP
jagan
praja sankalpa yatra
  • Loading...

More Telugu News