Krishna District: లడ్డు వేలంపాటలో ఘర్షణ... యువకుడి మృతి

  • లడ్డూ వేలంపాటలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
  • కృష్ణా జిల్లా ముసునూరు మండలం పెదపాటివారిగూడెంలో
  • గాయపడ్డ ప్రసాద్ అనే యువకుడి మృతి

వినాయకుడి లడ్డూ వేలంపాటలో ఇరు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో గాయపడ్డ రామవరప్రసాద్ అనే యువకుడు మృతి చెందాడు. ఈ నెల 20న కృష్ణా జిల్లా ముసునూరు మండలం పెదపాటివారిగూడెంలో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రంగా గాయపడ్డ ప్రసాద్ ను విజయవాడలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. తన కుమారుడి మృతికి కారణమైన మాజీ సర్పంచ్ సుబ్బారావు, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లి దేవకీదేవి డిమాండ్ చేశారు. 

Krishna District
musunuru mandal
vinayaka laddu
  • Loading...

More Telugu News