Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ కు మరో భారీ పరిశ్రమ.. రూ.700 కోట్లు పెట్టుబడి పెట్టనున్న ట్రైటన్ సోలార్!

  • ముఖ్యమంత్రి సమక్షంలో అవగాహనా ఒప్పందం
  • విద్యుత్ బ్యాటరీల తయారీకి నిర్ణయం
  • 200 ఎకరాల భూమిని కోరిన కంపెనీ

ఆంధ్రప్రదేశ్ కు మరో కీలక ప్రాజెక్టు రాబోతోంది. సోలార్ బ్యాటరీ తయారీలో అగ్రగామిగా పేరు గాంచిన ‘ట్రైటన్ సోలార్’ ఏపీలో తమ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చింది. ఇందులో భాగంగా రూ.727 కోట్లతో సోలార్ బ్యాటరీ తయారీ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని కంపెనీ ప్రకటించింది. అమెరికాలో పర్యటిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ట్రైటన్ కంపెనీ ప్రతినిధులు, ఏపీ అధికారులు అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నారు.

ప్లాంటు ఏర్పాటుకు 100-200 ఎకరాల భూమి అవసరమని ట్రైటన్ కంపెనీ ఛైర్మన్‌ హిమాంశు పటేల్‌ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం దశలవారీగా పెట్టుబడులు పెడతామని వెల్లడించారు. ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా పెద్దఎత్తున ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కలుగుతాయని పేర్కొన్నారు. ఈ సోలార్ బ్యాటరీల తయారీకి నానో టెక్నాలజీ ‘లిథియం పాలిమర్‌’ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తమ ప్రభుత్వం సోలార్ వాహనాలను పెద్దఎత్తున ప్రోత్సహిస్తుందని తెలిపారు.

Andhra Pradesh
triton solar
Chandrababu
usa
UNO
  • Loading...

More Telugu News