janwi kapoor: జాన్వీకపూర్ టాలీవుడ్ ఎంట్రీ.. విజయ్ దేవరకొండ సరసన నటించే ఛాన్స్!

  • ముగ్గురు దర్శకులతో చర్చలు
  • ధడక్ తో ఇప్పటికే సక్సెస్ కొట్టిన జాన్వీ
  • వివరాలు వెల్లడించిన సినీ విశ్లేషకుడు బాలా

శ్రీదేవి కుమార్తెగా ఇండస్ట్రీకి పరిచయమైనా ధడక్ సినిమాతో జాన్వీ కపూర్ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ప్రస్తుతం ఆమెకు బాలీవుడ్ లో చాలా ఆఫర్లు వస్తున్నప్పటికీ ఆచితూచి నిర్ణయం తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో జాన్వీ కపూర్ దక్షిణాది సినిమాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆమెతో ఇద్దరు తమిళ దర్శకులతో పాటు ఓ తెలుగు దర్శకుడు చర్చలు జరుపుతున్నారు.

అన్నీ కొలిక్కి వస్తే ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ తెలుగు హీరో విజయ్ దేవరకొండ సరసన నటించవచ్చని సినీ విశ్లేషకుడు రమేశ్ బాలా తెలిపాడు. ముగ్గురు దర్శకులతో ప్రస్తుతం సినిమాలకు సంబంధించి జాన్వీ చర్చలు జరుపుతోందని వెల్లడించాడు.  పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీతగోవిందం వంటి వరుస హిట్లు ఇచ్చిన విజయ్ దేవరకొండ తదుపరి చిత్రం ‘నోటా’ అక్టోబర్ 5న విడుదల కానున్న సంగతి తెలిసిందే.

janwi kapoor
vijay devarakonda
Tollywood
telugu
Talking Movies
cinema
  • Loading...

More Telugu News