Andhra Pradesh: కేడర్‌లో ధైర్యం నింపడానికే ఎమ్మెల్యేను చంపేశారు: మాజీ డీజీపీ మాలకొండయ్య

  • వారోత్సవాల సమయంలో పోలీసులను టార్గెట్ చేస్తారు
  • ఈసారి ఎమ్మెల్యేను హత్య చేశారు
  • విశాఖలో మావోయిస్టుల కదలికలు తక్కువ

కేడర్‌లో ధైర్యం నింపేందుకే ఎమ్మెల్యే కిడారిని మావోయిస్టులు హత్య చేశారని మాజీ డీజీపీ మాలకొండయ్య అభిప్రాయపడ్డారు. మామూలుగా అయితే వారోత్సవాలు జరుపుకునేటప్పుడు పోలీసులను టార్గెట్ చేస్తారని, కానీ ఈసారి ఎమ్మెల్యే కిడారి, మాజీ ఎమ్మెల్యే సోమను టార్గెట్ చేశారని పేర్కొన్నారు. పోలీసులను టార్గెట్ చేయడాన్ని వారి పరిభాషలో స్టేట్ యాక్షన్ అంటారని మాలకొండయ్య పేర్కొన్నారు. గుంటూరు జిల్లా చినకాకానిలో మీడియాతో మాట్లాడుతూ ఆయనీ విషయాన్ని వెల్లడించారు. కేడర్‌లో ధైర్యం నింపడానికే వారీ ఎత్తుగడ వేసి ఉండొచ్చని మాజీ డీజీపీ అభిప్రాయపడ్డారు. నిజానికి విశాఖ ఏజెన్సీలో మావోయిస్టులకు ప్రజల మద్దతు లేదని పేర్కొన్నారు.  

కాగా, కిడారి ప్రయాణిస్తున్న వాహనాన్ని చుట్టుముట్టిన మావోయిస్టులు ఆయనను కారు నుంచి కిందికి దించడం,  హతమార్చాక ఘటనా స్థలం నుంచి వారు పరుగులు పెట్టడం ఉన్న వీడియో ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చి హల్‌చల్ చేస్తోంది. ప్రత్యక్ష సాక్షి ఒకరు ఈ వీడియోను తన సెల్‌ఫోన్‌లో చిత్రీకరించినట్టు తెలుస్తోంది.

Andhra Pradesh
Kidari
MLA
DGP
Malakondaiah
Guntur District
  • Loading...

More Telugu News