Narendra Modi: కాంగ్రెస్ పార్టీ ఆ విషయాన్ని గుర్తించింది.. అందుకే బురద జల్లుతోంది: మోదీ

  • దేశానికి కాంగ్రెస్ భారంగా మారింది
  • కమలంపై ఎంతగా బురద జల్లితే అంతగా వికసిస్తుంది
  • చివరికి చిన్న పార్టీల మద్దతు కోరే స్థాయికి దిగజారింది

మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో మంగళవారం నిర్వహించిన ‘కార్యకర్త మహాకుంభ్‌’ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగారు. అభివృద్ధి పనులపై చర్చించడం కంటే కేంద్రంపై బురద జల్లడమే తేలికని ఆ పార్టీ గుర్తించిందని, అందుకనే ఆ పనిలో నిమగ్నమై ఉందని ఆరోపించారు. కమలంపై ఎంతగా బురద జల్లితే అది అంతగా వికసిస్తుందని అన్నారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి పనులపై చర్చ పెట్టాలని కాంగ్రెస్ నేతలను అభ్యర్థిస్తున్నా వారాపని చేయడం లేదన్నారు. దానికంటే కేంద్రంపై బురద జల్లడమే చాలా తేలికైన పని అని కాంగ్రెస్ గుర్తించిందని, అందుకనే ఆ పని చేస్తోందని ఆరోపించారు.

దేశానికి భారంగా మారిన కాంగ్రెస్ పార్టీ నుంచి దేశాన్ని కాపాడడం బీజేపీ కార్యర్తల బాధ్యత అని మోదీ పేర్కొన్నారు. దేశం వెలుపలి శక్తుల మద్దతు కోసం కాంగ్రెస్ ఎదురుచూస్తోందని తీవ్రస్థాయిలో విమర్శించారు. ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే కాంగ్రెస్ చివరికి చిన్న పార్టీల మద్దతు కోరే స్థాయికి దిగజారిందని ప్రధాని మోదీ ఎద్దేవా చేశారు.

Narendra Modi
BJP
Congress
Rahul Gandhi
Madhya Pradesh
Bhopal
  • Loading...

More Telugu News