Tanusri datta: సెట్లో ఓ నటుడు నా చెయ్యి పట్టుకుని లాగాడు: తనుశ్రీ దత్తా

  • వీరభద్ర సినిమాలో నటించిన తనుశ్రీ దత్తా
  • వేధింపుల విషయాన్ని వెంటనే మీడియాకు వెల్లడించా
  • అప్పటి నుంచే అవకాశాల్లేవు

బాలకృష్ణ కథానాయకుడిగా తెరకెక్కిన 'వీరభద్ర' సినిమాలో కథానాయికగా నటించిన తనుశ్రీ దత్తా ఇండస్ట్రీలో తను ఎదుర్కొన్న ఓ వేధింపుల అంశాన్ని మరోసారి బయటపెట్టింది. ఐదేళ్లకు మించి చిత్ర సీమలో తాను కొనసాగలేకపోవడానికి కారణం.. తన వేధింపుల విషయాన్ని మీడియా ముందు వెల్లడించడమేనంటోంది.

‘‘హాలీవుడ్‌లో మీటూ హ్యాష్ ట్యాగ్ ఉద్యమం రెండేళ్ల క్రితం మొదలైంది. కానీ దాన్ని నేను ఎన్నో ఏళ్ల క్రితమే ప్రారంభించా. ‘హార్న్ ఓకే ప్లీజ్’ అనే హిందీ చిత్రంలో నేనొక్కదాన్నే నర్తించాల్సిన పాట ఉంది. ఆ సమయంలో ఓ నటుడు నా చెయ్యి పట్టుకుని లాగాడు. ఎవరెంత వారించినా వినలేదు. ఈ విషయం నేనప్పుడే మీడియాకు వెల్లడించా. మూడు రోజుల పాటు ఈ సంఘటన టీవీలో ప్రసారమైంది. కానీ ఇప్పుడు దాన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఈ సంఘటనతో నా సినిమా అవకాశాలన్నీ పోయాయి’’ అంటూ తనుశ్రీ వాపోయింది. 

Tanusri datta
veerabhadra
balakrishna
hollywood
bollywood
  • Loading...

More Telugu News