Virat Kohli: ‘రాజీవ్ ఖేల్ రత్న’ పురస్కారాన్ని అందుకున్న విరాట్ కోహ్లీ

  • జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం
  • ఇరవై మంది ఉత్తమ క్రీడాకారులకు అర్జున అవార్డులు
  • కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులు

రాజీవ్ ఖేల్ రత్న పురస్కారాన్ని భారత క్రికెట్ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను అందుకున్నారు. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో జాతీయ క్రీడా పురస్కారాల ప్రదానోత్సవం ఈరోజు ఘనంగా జరిగింది. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని కోహ్లీ, మీరాబాయి చాను అందుకున్నారు. ఈ సందర్భంగా ఇరవై మంది ఉత్తమ క్రీడాకారులకు అర్జున అవార్డులు, కోచ్ లకు ద్రోణాచార్య అవార్డులను అందజేశారు. అర్జున అవార్డు అందుకున్న వారిలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన షట్లర్ నేలకుర్తి సిక్కిరెడ్డి కూడా ఉన్నారు.

Virat Kohli
meera bhai chanu
rajiv khel ratna
  • Loading...

More Telugu News