Araku: హత్యకు ముందు... ఎమ్మెల్యే కిడారి వాహనాన్ని చుట్టుముట్టిన మావోలు... వీడియో!

  • తన వాహనంలో వెళుతున్న వేళ చుట్టుముట్టిన మావోలు
  • వెలుగులోకి వచ్చిన విజువల్స్
  • కిడారి వాహనం చుట్టూ కనిపిస్తున్న 20 మంది

రెండు రోజుల క్రితం అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తన వాహనంలో వెళుతున్న వేళ, చుట్టుముట్టిన దాదాపు 60 మంది మావోయిస్టులు ఆయన్ను ప్రజా కోర్టులో నిలిపి, తుపాకితో కాల్చి దారుణంగా చంపిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను కూడా కాల్చి చంపారు. ఇక కిడారి వెళుతున్న వేళ చుట్టుముట్టిన మావోయిస్టుల విజువల్స్ ఇప్పుడు వెలుగులోకి వచ్చాయి. ఆయన వాహనాన్ని సుమారు 20 మంది మావోయిస్టులు నిలిపి, దాని చుట్టూ నిలబడటం ఇందులో కనిపిస్తోంది. ఆపై ఆయన్ను కారు నుంచి బలవంతంగా దించి లాక్కెళ్ళారు. ఈ దృశ్యాలు ఇప్పుడు వార్తా చానళ్లలో ప్రముఖంగా ప్రసారం అవుతున్నాయి. వాటిని మీరు కూడా చూడవచ్చు.

Araku
Kidari
Maoists
Murder
  • Error fetching data: Network response was not ok

More Telugu News