KCR: కేసీఆర్ చేష్టలు కట్టుకున్న భార్యను మరొకరి వద్దకు పంపినట్టున్నాయి: కొండా సురేఖ

  • కేసీఆర్ అంటే గౌరవం ఉంది
  • ఆయన చేష్టలు మాత్రం నచ్చడం లేదు
  • నమ్మి అధికారాన్ని ఇస్తే, ముందస్తు ఎందుకు
  • టీఆర్ఎస్ ఓటమి ఖాయమన్న కొండా సురేఖ

తెలంగాణ ఉద్యమ సారధిగా, ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన నేతగా కేసీఆర్ అంటే తనకు గౌరవం ఉందని చెబుతూనే, ఆయన ప్రస్తుత చేష్టలు కట్టుకున్న భార్యతో కొంతకాలం కాపురం తరువాత మరొకరి వద్దకు పంపించినట్టు ఉన్నాయని టీఆర్ఎస్ కు రాజీనామా చేసిన కొండా సురేఖ సంచలన విమర్శలు చేశారు.

అమరవీరులకు ఏ మాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదని ఆరోపించిన ఆమె, ప్రజలను కేసీఆర్ మోసం చేశారని ఆరోపించారు. నమ్మి అధికారాన్ని చేతికి అప్పగిస్తే, ముందస్తుకు వెళ్లడం ద్వారా తన పతనాన్ని తానే కోరి తెచ్చుకుని, ఇప్పుడు అధికారాన్ని వేరే పార్టీలకు అప్పగిస్తున్నారని దుయ్యబట్టారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయం సాధించే అవకాశాలు లేవని అభిప్రాయపడ్డ ఆమె, అధికార మార్పిడి తప్పనిసరని అన్నారు.

ప్రజలు ఇచ్చిన అధికారాన్ని మధ్యలోనే వదిలేయడం భార్యను వదిలించుకోవడం వంటిదేనని అభిప్రాయపడ్డ ఆమె, ప్రతి ఒక్కరూ కేసీఆర్ చర్యలను ఖండిస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకు ముందస్తుకు వెళుతున్నట్టు చెబుతున్న కేసీఆర్ ను ఆ పార్టీ నేతలే విశ్వసించడం లేదని అన్నారు.

KCR
Konda Surekha
Telangana
Hyderabad
Media Meet
  • Loading...

More Telugu News