aanand: నేను నదిలో మునిగిపోతుంటే దివ్యభారతి కాపాడింది!: సీనియర్ హీరో ఆనంద్

  • దివ్యభారతి ఫస్టు తమిళ మూవీ నాతోనే
  • డీప్ ఫారెస్ట్ లో 60 రోజుల పాటు షూటింగ్ 
  • నదిలో పాటను చిత్రీకరిస్తున్నారు    

తాజాగా 'అలీతో సరదాగా' కార్యక్రమంలో సీనియర్ హీరో ఆనంద్ మాట్లాడుతూ, కెరియర్ తొలినాళ్లలో షూటింగులో ఎదురైన ఒక ప్రమాదకరమైన సంఘటనను గురించి ప్రస్తావించారు. "తమిళంలో దివ్యభారతి తొలిసారిగా నాతోనే నటించింది. ఆ సినిమా షూటింగ్ 60 రోజుల పాటు డీప్ ఫారెస్ట్ లో జరిగింది. ఆ ఫారెస్ట్ లోపలికి వెళ్లడానికి సినిమావాళ్లే రోడ్డు వేశారు.

అడవికి సమీపంలోని నదిలో ఒక పాటను చిత్రీకరిస్తున్నారు. పాట కోసమని చెప్పి ఒక చిన్న పడవను కూడా తయారు చేయించారు. పడవలో నదిలోకి పంపించేటప్పుడు 'ఈత తెలుసా' అని యూనిట్ వాళ్లు అడిగితే 'తెలుసు' అని అబద్ధం చెప్పాను. దురదృష్టం కొద్దీ నదిలో కొంత దూరం వెళ్లగానే పడవ మునిగిపోయింది. నాకు ఈత వచ్చనుకుని దివ్యభారతి చకచకా ఈదుకుంటూ ఒడ్డుకు వెళుతోంది. నేను మునిగిపోతుండటం యూనిట్ వాళ్లు చూసి అరిచారు. వాళ్లతో పాటు దివ్యభారతి కూడా వచ్చి, నన్ను ఒడ్డుకు తీసుకెళ్లింది" అంటూ చెప్పుకొచ్చారు.       

  • Loading...

More Telugu News