kidari: కాల్పులు జరపవద్దు.. మీకు కూడా ప్రమాదం కలుగుతుంది: గన్ మెన్ ను వారించిన కిడారి

  • కిడారి, సోమలను కాల్చి చంపిన మావోయిస్టులు
  • విచారణను ముమ్మరం చేసిన పోలీసులు
  • ప్రత్యక్ష సాక్షులను విచారిస్తున్న పోలీసులు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను మావోయిస్టులు కిరాతకంగా కాల్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు విచారణను ముమ్మరం చేశారు. పలువురిని కలసి ఘటనకు సంబంధించిన విషయాలను సేకరిస్తున్నారు.

కొందరు సాక్షుల వాంగ్మూలం ప్రకారం... నేతలు ప్రయాణిస్తున్న వాహనాలను మావోయిస్టులు ఆపారు. కిడారి, సోమలతో మాట్లాడతామని వారిని కొంచెం దూరం తీసుకెళ్లారు. కాసేపటి తర్వాత ఇద్దరినీ కాల్చి చంపారు. మావోయిస్టులు వాహనాలను ఆపగానే... కాల్పులు జరపవద్దని గన్ మెకు కిడారి చెప్పారట. మావోయిస్టులతో తాను మాట్లాడతానని, ఒకవేళ వారు వినకపోతే తమ ఇద్దరి ప్రాణాలు మాత్రమే పోతాయని... లేకపోతే మీకు కూడా ముప్పు ఏర్పడుతుందని గన్ మెన్ కు కిడారి చెప్పినట్టు ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు.

kidari
soma
maoist
police
  • Loading...

More Telugu News