Araku: హత్యల తరువాత పారిపోతున్న మావోలు కామేశ్వరి, శ్రీనుబాబు... వీడియో!

  • కాల్పుల తరువాత పరిగెడుతున్న కామేశ్వరి, శ్రీనుబాబు
  • సెల్ ఫోన్లలో చిత్రీకరించిన స్థానికులు
  • భారీఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్న పోలీసులు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను అడ్డుకుని, తుపాకులతో కాల్చి దారుణంగా చంపిన మావోలు అక్కడి నుంచి పారిపోతున్న దృశ్యాలు ఇప్పుడు మీడియాకు చిక్కాయి. ఈ వీడియోల్లో ఉన్నది పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన కామేశ్వరి అలియాస్ సింద్రి, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన జలుమూరు శ్రీనుబాబు అలియాస్ రైనోగా పోలీసులు అనుమానిస్తున్నారు.

 హత్యల అనంతరం వీరు పారిపోతుండగా, కొందరు స్థానికులు తమ సెల్ ఫోన్లలో ఈ దృశ్యాలను చిత్రీకరించారు. కాగా, అరకు ప్రాంతంలో మావోలు పెద్దఎత్తున సంచరిస్తుండటంతో, రంగంలోకి దిగిన పోలీసు బలగాలు భారీ ఎత్తున కూంబింగ్ నిర్వహిస్తున్నాయి. మరోవైపు ఒడిశా, చత్తీస్ గఢ్ రాష్ట్రాల పోలీసులు కూడా కూంబింగ్ లో పాలుపంచుకుంటూ ఉండటంతో మన్యం యుద్ధక్షేత్రాన్ని తలపిస్తోంది.

Araku
Police
Coombing
Vally
Maoists
  • Error fetching data: Network response was not ok

More Telugu News