Khammam District: నాలుగు నెలలుగా మహిళకు కల... పొలంలో తవ్విచూస్తే బయటపడ్డ దుర్గమ్మ విగ్రహం!

  • రఘునాథపాలెం మండలంలో వింత ఘటన
  • కలలో కనిపిస్తున్న దుర్గామాత
  • విగ్రహం బయటపడటంతో ప్రత్యేక పూజలు

ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలంలో ఓ వింత ఘటన జరిగింది. ఇక్కడికి సమీపంలోని జాన్‌ బాద్‌ తండాలో నివాసం ఉంటున్న ఏనుగుల ఉపేంద్రమ్మ అనే మహిళకు గత నాలుగు నెలలుగా బానోతు వెంకన్న అనే వ్యక్తికి చెందిన పొలంలో దుర్గామాత కొలువై ఉన్నట్టు కలలు వస్తున్నాయి.

ఈ విషయాన్ని వెంకన్నకు పలుమార్లు చెప్పినా, ఆయన తొలుత పట్టించుకోలేదు. పొలంలో తవ్వకాలు జరిపి చూడాలని ఆమె పట్టుబట్టగా, చివరికి వెంకన్న అంగీకరించి, నలుగురి సమక్షంలో తవ్వకాలు జరిపించాడు. తవ్వకాల్లో ఓ దుర్గామాత విగ్రహం బయటపడింది. దీంతో దుర్గమ్మ తమను ఆదుకునేందుకు స్వయంభువుగా వెలిసిందని ప్రజలు ప్రత్యేక పూజలు చేయడం ప్రారంభించారు. ఇక్కడ గుడి కడతామని వారు స్పష్టం చేశారు.

ఇక పెద్దఎత్తున భక్తులు వస్తుండటంతో, విషయం తెలుసుకున్న పోలీసులు బందోబస్తును ఏర్పాటు చేసి, పురావస్తు అధికారులకు సమాచారం ఇచ్చారు. కాగా, ఈ ప్రాంతంలో గతంలో శివాలయం ఉండేదని ఇక్కడి వారు అంటున్నారు.

Khammam District
Durga Mata
Idol
Dreams
  • Loading...

More Telugu News