KCR: కేసీఆర్‌ అంటే నాకెందుకు భయం?: బండ్ల గణేశ్

  • కేసీఆర్ గొప్ప వ్యక్తే..
  • కానీ పరిపాలనాదక్షుడు కాదు
  • వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు ఖాయం

కేసీఆర్ అంటే తనకు భయమన్న వార్తల్లో నిజం లేదని కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ అన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమన్న ఆయన కేసీఆర్ గొప్ప నేతే కానీ.. పరిపాలనాదక్షుడు మాత్రం కాదన్నారు. తెలంగాణ కోసం 14 ఏళ్లు పోరాడిన ఆయన అనుకున్నది సాధించారని ప్రశంసించారు. అయితే, ప్రజలకు మాత్రం చేరువలో లేరని విమర్శించారు. కేసీఆర్‌ను విమర్శించే స్థాయి తనకు లేదన్న బండ్ల గణేశ్.. ఆయనంటే భయం కాబట్టే విమర్శించడం లేదన్న వార్తల్లో నిజం లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుభి మోగించడం ఖాయమని గణేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.

KCR
Bandla Ganesh
Congress
TRS
  • Loading...

More Telugu News