Tamil Nadu: రజనీకాంత్ పార్టీ వచ్చేస్తోంది.. డిసెంబరులో ప్రారంభం!

  • పార్టీ ప్రారంభం పక్కా అన్న షణ్ముగం
  • తాము కూడా రజనీతో కలిసి నడుస్తామని ప్రకటన
  • ఇప్పటికే పార్టీ ప్రారంభించిన కమల్

తమిళనాడు రాజకీయ యవనికపైకి మరో పార్టీ వచ్చేస్తోంది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఈ ఏడాది డిసెంబరులో పార్టీని ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు. ఈ మేరకు రజనీకాంత్ సన్నిహితుడైన పుదియనీతి కట్చి వ్యవస్థాపకుడు ఏసీ షణ్ముగం తెలిపారు. సోమవారం ఆయన చెన్నైలో విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది డిసెంబరులో రజనీకాంత్ పార్టీని ప్రారంభిస్తారని, ఇందులో ఎటువంటి సందేహం లేదని పేర్కొన్నారు. తాము కూడా రజనీకాంత్‌తోనే సాగుతామని ఆయన స్పష్టం చేశారు. కాగా, మరో సూపర్ స్టార్ కమలహాసన్ ఇప్పటికే పార్టీని ప్రారంభించి దూకుడు మీదున్నారు.

Tamil Nadu
Rajinikanth
Kamal Haasan
Political party
Chennai
  • Loading...

More Telugu News