Pawan Kalyan: నేను 'భక్త ఆఫ్ పవన్ కల్యాణ్'.. కానీ కాంగ్రెస్సే గెలవాలి: బండ్ల గణేశ్

  • పవన్ నా బాస్
  • ఆయన గురించి మాట్లాడే స్థాయి కాదు నాది
  • రాజకీయం వేరు.. అభిమానం వేరు

కాంగ్రెస్ నేత బండ్ల గణేశ్ కీలక వ్యాఖ్యలు చేశారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు తాను వీరాభిమానినని, అయినప్పటికీ వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్సే విజయం సాధించాలని పేర్కొన్నారు. తాను సన్నాఫ్ నాగేశ్వరరావు అని చెప్పుకోవడం ఎంత నిజమో.. భక్త ఆఫ్ పవన్ కల్యాణ్ అని చెప్పుకోవడం కూడా అంతే కరెక్టన్నారు.

పవన్ తన బాస్ అని, ఆయన గురించి మాట్లాడే అర్హత తనకు లేదని బండ్ల గణేశ్ పేర్కొన్నారు. పవన్‌కు తాను భక్తుడినని పేర్కొన్న గణేశ్.. రాజకీయంగా మాత్రం కాంగ్రెస్ విజయం సాధించాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. తాను తుది శ్వాస విడిచే వరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని బండ్ల గణేశ్ స్పష్టం చేశారు.

Pawan Kalyan
Bandla Ganesh
Telangana
Congress
  • Loading...

More Telugu News