bandaru dattatreya: బండారు దత్తాత్రేయ అలక.. ‘మెట్రో’ రైలు దిగిపోయిన వైనం!

  • అమీర్ పేట- ఎల్బీ నగర్ ‘మెట్రో’ ఎక్కిన బండారు
  • ‘మెట్రో’ పై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై అసంతృప్తి
  • మార్గమధ్యంలో ఎంజీబీఎస్ స్టేషన్ లో దిగిన దత్తన్న

అమీర్ పేట నుంచి ఎల్బీ నగర్ వరకూ మెట్రో రైలును గవర్నర్ నరసింహన్, మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్, కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ తదితరులు ఈరోజు ప్రారంభించారు. అమీర్ పేట నుంచి ఎల్బీనగర్ కు మెట్రో రైలులో వీరు ప్రయాణించారు. అయితే, ‘మెట్రో’ రైలుపై ప్రధాని మోదీ ఫొటో లేకపోవడంపై దత్తాత్రేయ అసంతృప్తి వ్యక్తం చేశారు. మార్గమధ్యంలోనే ఆయన రైలు దిగి వెళ్లిపోయారు. ఎంజీబీఎస్ స్టేషన్ లో రైలు ఆగగానే దత్తాత్రేయ దిగిపోయారు. కాగా, గవర్నర్, మంత్రులు మాత్రం ఎంజీబీఎస్ ఇంటర్ ఛేంజ్ స్టేషన్ ను పరిశీలించారు.

bandaru dattatreya
metro rail
  • Loading...

More Telugu News