amirkhan: 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'నుంచి 'ఫిరంగి'గా ఆమిర్ ఖాన్

  • భారీ బడ్జెట్ తో 'థగ్స్ ఆఫ్ హిందుస్థాన్'
  • ప్రధాన పాత్రల్లో అమితాబ్ .. ఆమిర్ .. కత్రినా . . ఫాతిమా 
  • నవంబర్ 8వ తేదీన భారీ విడుదల  

యశ్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై .. విజయ్ కృష్ణ ఆచార్య దర్శకత్వంలో 'థగ్స్ ఆఫ్ హిందూస్థాన్' సినిమా రూపొందుతోంది. అమితాబ్ .. ఆమిర్ ఖాన్ .. కత్రినా కైఫ్ .. ఫాతిమా సనా షేక్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. ఇప్పటికే అమితాబ్ .. కత్రినా .. ఫాతిమా పాత్రలను పరిచయం చేస్తూ ఫస్టులుక్ పోస్టర్స్ వచ్చేశాయి. తాజాగా ఆమిర్ ఖాన్ 'ఫిరంగి' పాత్రను పరిచయం చేస్తూ, ఆయన ఫస్టు పోస్టర్ ను రిలీజ్ చేశారు.

పాత కోటు .. టోపీని ధరించి, విభిన్నమైన వేషధారణలో గాడిదపై ప్రయాణం చేస్తూ ఆయన కనిపిస్తున్నాడు. "నేను .. ఫిరంగి ముల్లాహ్ .. ఈ భూమి మీద నాకంటే మంచి మనిషి మీకు ఎక్కడా కనిపించడు. నిజం నా రెండో పేరు .. నమ్మకం నా వృత్తి .. నాయనమ్మ మీద ఒట్టు" అని చెబుతూ ఆమిర్ ఖాన్ తన పాత్రకి సంబంధించిన లుక్ ను రిలీజ్ చేశారు. నవంబర్ 8వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నారు.    

  • Loading...

More Telugu News