jennifer lopez: స్టేజిపై నుంచి జారి పడిన జెన్నిఫర్ లోపెజ్!

  • లాస్ వెగాస్ లో ఓ కార్యక్రమం సందర్భంగా ఘటన
  • ప్రేక్షకులకు కరచాలనం చేస్తూ కింద పడ్డ జెన్నిఫర్
  • ఏమాత్రం తడబడకుండా, కార్యక్రమాన్ని కొనసాగించిన జేలో

ప్రముఖ గాయని, బాలీవుడ్ నటి జెన్నిఫర్ లోపెజ్ స్టేజిపై జారిపడింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లాస్ వెగాస్ లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఈ ఘటన జరిగింది. పాటపాడుతూ ఉన్న సమయంలో వేదిక ముందు ఉన్న ప్రేక్షకులకు కరచాలనం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. అయితే, కిందపడ్డా ఏమాత్రం తొట్రుపడకుండా, వెంటనే లేచి నిలబడి, జెన్నిఫర్ తన పర్ఫామెన్స్ ను కొనసాగించింది. ఈ కార్యక్రమంలో జెన్నిఫర్ బోయ్ ఫ్రెండ్ అలెక్స్ రొడ్రిగోజ్ తో పాటు సెలెనా గోమెజ్, జిస్సికా అల్బా, దువా లిపా, బెక్కీ జీ, సోఫియా వెర్జరా తదితరులు పాల్గొన్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News