kidari saveswara rao: ప్రత్యేక హెలికాప్టర్ లో అరకు బయల్దేరిన మంత్రులు

  • కిడారి, సోమల అంత్యక్రియలకు ఏపీ మంత్రులు
  • విశాఖ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో అరకు పయనం
  • మావోల దాడితో ఏపీ, టీఎస్ పోలీసుల అలర్ట్

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమల అంత్యక్రియలకు ఏపీ మంత్రులు హాజరు కానున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వారు బయల్దేరారు. హోం మంత్రి చినరాజప్ప, మంత్రులు కళా వెంకట్రావు, నక్కా ఆనందబాబు, సుజయ్ కృష్ణ రంగారావు, జవహర్ లు అరకు పయనమయ్యారు. మరోవైపు, మావోల దాడితో ఇరు తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులు అలర్ట్ అయ్యారు. ఎన్నికల సమయం కావడంతో, మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేస్తున్నారు.

kidari saveswara rao
soma
maoist
ap
ministers
  • Loading...

More Telugu News