నేడు ఏలూరులో పర్యటించనున్న పవన్ కల్యాణ్!
- పశ్చిమగోదావరిలో మూడో విడత పర్యటన
- ఉంగుటూరులో పోరాటయాత్ర సభ
- మేధావులు, సంఘాలతో పవన్ భేటీ
పవన్ ఇప్పటికే పశ్చిమగోదావరి జిల్లాలోని 8 నియోజకవర్గాల్లో రెండు విడతలుగా పర్యటించారు. మూడో విడతలో భాగంగా ఏలూరుకు నేడు చేరుకోనున్నారు. నిన్న నటుడు, కమెడియన్ అలీతో కలసి నెల్లూరు బారా షహీద్ దర్గాను పవన్ కల్యాణ్ దర్శించుకున్న సంగతి తెలిసిందే.