kidari sarveswar rao: మావోయిస్టులకు నాయకత్వం వహించింది చైతన్య అలియాస్ అరుణ!

  • దాడికి పాల్పడింది నందాపూర్ ఏరియా కమిటీ
  • మావోయిస్టు అగ్రనేత చలపతి భార్య అరుణ నాయకత్వం?
  • స్వరూప, సునీల్ ఆధ్వర్యంలో మహిళా మావోయిస్టులు

అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమలను నిన్న మధ్యాహ్నం మావోయిస్టులు కిరాతకంగా హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సంబంధించి కొత్త కోణం వెలుగులోకి వచ్చింది. ప్రతాప్ రెడ్డి అలియాస్ చలపతి ఆధ్వర్యంలో దాడి జరిగినట్టు తొలుత భావించినప్పటికీ... నందాపూర్ ఏరియా కమిటీ ఈ దాడికి పాల్పడినట్టు పోలీసులు నిర్ధారించారు.

ఈ దళానికి చైతన్య అలియాస్ అరుణ నాయకత్వం వహించినట్టు పోలీసులు చెబుతున్నారు. స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలిగా నారాయణపట్నం ఏరియా కమిటీ బాధ్యతలను ఆమె చూస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అరుణను చలపతి భార్యగా పోలీసులు అనుమానిస్తున్నారు. దాడికి పాల్పడిన వారిలో డివిజనల్ కమిటీ మెంబర్ రింకి అలియాస్ స్వరూప, రైనో అలియాస్ సునీల్ ఆధ్వర్యంలో మహిళా మావోయిస్టులు ఉన్నారని పోలీసులు తెలిపారు.

kidari sarveswar rao
siveri soma
maoist
murder
aruna
chalapathi
  • Loading...

More Telugu News