Chandrababu: న్యూయార్క్ లో చంద్రబాబుకు ఘన స్వాగతం

  • న్యూయార్క్ చేరుకున్న చంద్రబాబు
  • విమానాశ్రయం వద్ద ఘన స్వాగతం
  • భారీగా తరలి వచ్చిన ఎన్నారైలు

అమెరికా పర్యటనకు వెళ్లిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు న్యూయార్క్ లో ఘన స్వాగతం లభించింది. ప్రవాసాంధ్రులు ముఖ్యమంత్రికి ఘనంగా స్వాగతం పలికారు. చంద్రబాబు రాక సందర్భంగా విమానాశ్రయం వద్దకు భారీ ఎత్తున టీడీపీ అభిమానులు చేరుకున్నారు. చంద్రబాబుకు పుష్పగుచ్ఛాలు ఇచ్చి స్వాగతం పలికారు. ఆ తర్వాత ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమ హత్యలపై సమీక్ష నిర్వహించారు. శాంతిభద్రతలను అనుక్షణం పర్యవేక్షించాలని పోలీసు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ పర్యటన సందర్భంగా ఐక్యరాజ్యసమితిలో చంద్రబాబు ప్రసంగించనున్నారు. 

Chandrababu
america
new york
Telugudesam
  • Loading...

More Telugu News