film nagar: గత ఏడాది రూ. 2 లక్షలు పలికిన 'గణేశ్' లడ్డూ... ఈసారి ఏకంగా రూ. 15 లక్షలు దాటేసింది!

  • ఎన్నడూ లేనంత ధర పలికిన ఫిలింనగర్ లడ్డూ
  • గత ఏడాది రూ.2 లక్షలకు వేలం 
  • ఈ ఏడాది భారీ ధరకు సొంతం చేసుకున్న బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ 

వినాయక చవితి ఉత్సవాల్లో స్వామివారి లడ్డూది ప్రత్యేక స్థానం. చివరి రోజున వేలం వేసే లడ్డూను సొంతం చేసుకోవడానికి ఎంతో మంది పోటీపడతారు. వేలం పాట ఊహించని విధంగా పరుగులు పెడుతుంటుంది. పరువు కోసం కొందరు, స్వామి వారి లడ్డూను సొంతం చేసుకుంటే అంతా మంచే జరుగుతుందని మరికొందరు... లడ్డూ కోసం పోటీ పడతారు.

తాజాగా హైదరాబాద్ ఫిలింనగర్ వినాయకుడి లడ్డూ ఊహించని ధరకు అమ్ముడుపోయింది. గత ఏడాది వేలంపాటలో ఈ లడ్డూ కేవలం రూ. 2 లక్షలు మాత్రమే పలికింది. ఈసారి మాత్రం ఊహించని విధంగా 15 లక్షల వెయ్యి నూటపదహారు రూపాయలు పలికింది. బీజేపీ నేత పల్లపు గోవర్ధన్ ఈ లడ్డూను సొంతం చేసుకున్నారు.

film nagar
ganesh
ladoo
auction
  • Loading...

More Telugu News