team india: వార్ వన్ సైడే.. పాకిస్థాన్ ను చిత్తు చేసిన టీమిండియా

  • ఇండియాకు 238 పరుగుల విజయలక్ష్యాన్ని నిర్దేశించిన పాక్
  • సెంచరీలతో చెలరేగిన రోహిత్, ధావన్
  • ఒక్క వికెట్ కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించిన భారత్

ఆసియా కప్ సూపర్ ఫోర్ మ్యాచుల్లో భాగంగా నిన్న జరిగిన మ్యాచ్ లో టీమిండియా ఆటగాళ్లు చెలరేగిపోయారు. దాయాది దేశం పాకిస్థాన్ ను మళ్లీ చిత్తు చేశారు. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ భారత్ కు 238 పరుగుల టార్గెట్ ను విధించగా... 39.3 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి ఇండియా లక్ష్యాన్ని ఛేదించింది. భారత ఓపెనర్లు ఇద్దరూ సెంచరీలతో చెలరేగిపోయారు. కెప్టెన్ రోహిత్ శర్మ 119 బంతుల్లో 111 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. ధావన్ 100 బంతుల్లో 114 పరుగులు చేసి రనౌట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలో వన్డేల్లో 7 వేల పరుగుల మైలురాయిని రోహిత్ దాటాడు.

team india
Pakistan
asia cup
  • Loading...

More Telugu News