devadas: నాని ఓ సెల్ ఫోన్ పిచ్చోడు.. పక్కన అందమైన అమ్మాయి ఉన్నా పట్టించుకోడు!: నాగార్జున

  • నాని సీక్రెట్ బయటపెట్టిన నాగార్జున
  • అతనికి సెల్ ఫోనే ప్రపంచమని వెల్లడి
  • అందులో ఏం దాగుందో తనకు తెలియదని వ్యాఖ్య

టాలీవుడ్ కింగ్ నాగార్జున, నేచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో తెరకెక్కిన ‘దేవదాస్’ విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమాలోని నటీనటులు దేవదాస్ ప్రమోషన్ లో బీజీగా ఉన్నారు. ఈ సందర్భంగా నాగార్జున నానికి సంబంధించిన ఓ సీక్రెట్ ను బయటపెట్టారు. నాని ఫోన్ పిచ్చోడని వెల్లడించారు.

‘నానికి ఫోన్ చూడడం అలవాటుగా మారిపోయింది. అందులో ఏం చూస్తాడో నాకయితే తెలీదు. పక్కనే అందమైన అమ్మాయి ఉన్నా పట్టించుకోకుండా ఫోన్ నే చూస్తుంటాడు. ఫోన్ లో గంటలుగంటలు గడుపుతూ దాసు(దేవదాస్ లో నాని పేరు) నాకు చిరాకు తెప్పిస్తుంటాడు. మీకు చిరాకు తెప్పించే స్నేహితుడు ఎవరో ట్యాగ్ చేయండి’ అని ఓ వీడియోను ట్విట్టర్ లో నాగార్జున పోస్ట్ చేశారు. శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్న దేవదాస్ ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ సినిమా ట్రైలర్ కు చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది.

devadas
Tollywood
september 27
Nagarjuna
Nani
mobile
  • Error fetching data: Network response was not ok

More Telugu News