araku: అరకులో మావోయిస్టుల ఘాతుకాన్ని ఖండించిన సీఎం చంద్రబాబు!
- దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ
- ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడిని ఖండించాలి
- కిడారి, సోమ కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సానుభూతి
మావోయిస్టుల ఘాతుకంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అరకు ఎమ్మెల్యే సర్వేశ్వరరావును, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపడాన్ని తీవ్రంగా ఖండించారు. అరకులో ఇద్దరు నేతల హత్య విషయాన్ని అమెరికా పర్యటనలో ఉన్న చంద్రబాబుకు సంబంధిత అధికారులు తెలిపారు. దాడులు, హత్యలు మానవత్వానికే మచ్చ అని, ప్రజాస్వామ్య వాదులంతా ఈ దాడిని ఖండించాలని చంద్రబాబు అన్నారు. మావోయిస్టుల ఘాతుకంలో ప్రాణాలు కోల్పోయిన కిడారి, సోమ కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. కాగా, గిరిజనుల అభ్యున్నతికి కిడారి, శివేరి చేసిన సేవలను ఈ సందర్భంగా చంద్రబాబు కొనియాడారు.