Hyderabad: నిమజ్జనంలో మరో అపశ్రుతి... విధులు నిర్వహిస్తూ పోలీసు మృతి!

  • హైదరాబాద్ బందోబస్తు విధుల్లో నీమా నాయక్
  • సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో పనిచేస్తున్న ఏఎస్ఐ
  • గుండెపోటుతో కుప్పకూలి, ఆసుపత్రిలో మృతి

వినాయక నిమజ్జనంలో మరో అపశ్రుతి చోటు చేసుకుంది. హైదరాబాద్ లో ప్రత్యేక బందోబస్తు విధుల్లో పాల్గొనేందుకు వచ్చిన ఓ అసిస్టెంట్ సబ్ ఇనస్పెక్టర్ గుండెపోటుతో మరణించారు. సిద్దిపేట జిల్లా కొమరవెల్లిలో ఏఎస్ఐగా పనిచేస్తున్న నీమా నాయక్ ను, భాగ్యనగర్ గణేష్ నిమజ్జనంలో బందోబస్తు విధులకు నియమించారు. ఈ ఉదయం డ్యూటీ చేస్తున్న ఆయనకు అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ నీమా నాయక్ ప్రాణాలు వదిలారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నామని, నీమా నాయక్ కుటుంబాన్ని ఆదుకుంటామని ఉన్నతాధికారులు ప్రకటించారు.

Hyderabad
Police
Neema Naik
Ganesh Nimajjan
  • Loading...

More Telugu News