petro price: కొనసాగుతున్న పెట్రో ధరల మోత : పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 11 పైసలు పెంపు
- ఆశ్చర్యం, ఆవేదనకు లోనవుతున్న వాహన చోదకులు
- మోదీ సర్కార్ వైఫల్యంగా విమర్శలు గుప్పిస్తున్న రాహుల్
- జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారం అన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్
దేశంలో పెట్రో ధరల మంట ఆరడం లేదు. రోజురోజుకీ పెరుగుతున్న ధరలతో సగటు వాహన చోదకులు ఆందోళన, ఆవేదన చెందుతున్నారు. పెట్రోల్‌పై 17 పైసలు, డీజిల్‌పై 11 పైసలు పెంచుతూ పెట్రో ధరలను సవరించారు. తాజాగా పెరిగిన ధరలతో ముంబయిలో లీటరు పెట్రోల్ రూ.89.97...లీటర్ డీజిల్ 78.53గా నమోదైంది. హైదరాబాద్‌లో పెట్రోల్ రూ.87.58... డీజిల్ 80.46గా నమోదైంది. ఢిల్లీలో పెట్రోల్ రూ.82.61...డీజిల్ 73.97గా నమోదైంది. విజయవాడలో పెట్రోల్ రూ.86.95... డీజిల్ 79.51గా నమోదైంది. ఇంధన ధరలు భారీగా పెరుగుతుండడాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలోని పలు విపక్ష పార్టీలు భారత్ బంద్ పాటించిన విషయం తెలిసిందే. ఆ ఆతర్వాత కూడా ధరలు దిగిరాలేదు. ఢిల్లీలో ఇంధన ధరలు చుక్కలనంటుతుండడంతో విధిలేని పరిస్థితుల్లో ప్రధాని మెట్రోలో ప్రయాణిస్తున్నారంటూ కర్టాటక కాంగ్రెస్ విభాగం వ్యంగ్యంగా ట్వీట్ చేసింది. ఇంధన ధరలకు చెక్ పెట్టాలంటే జీఎస్టీ పరిధిలోకి తేవడమే పరిష్కారం అన్న కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రదాన్ మాటలు సగటు చోదకునికి ఊరటనిచ్చినా, ఆ మాటలు అమలు జరిగేనా అన్నదే ప్రశ్నార్థకం.