Warangal Urban District: 'అబ్బ చిలిపి...' అంటూ టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యే రాజయ్యతో మాట్లాడిన యువతి అదృశ్యం!

  • వైరల్ అయిన యువతి సరసపు సంభాషణ
  • ఇద్దరి భవిష్యత్ ఈ ఆడియోపైనే
  • యువతి అదృశ్యంతో తీవ్ర కలకలం

పగలబడి నవ్వుతూ, "అబ్బా చిలిపి... నాకు పోస్టు ఎప్పుడిస్తవ్? ఎప్పుడు చేతుల పెడుతవ్..." అంటూ తన సరసపు సంభాషణతో స్టేషన్ ఘనపూర్ తాజా మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య గొంతును పోలిన గొంతుతో సరదాగా మాట్లాడిన యువతి ఇప్పుడు అదృశ్యమైంది. సదరు యువతి సరసపు సంభాషణ వైరల్ కాగా, స్టేషన్ ఘనపూర్ లో ఇద్దరు నేతల భవిష్యత్తు ఈ ఆడియో క్లిప్పింగ్ పై ఆధారపడివుందని పలువురు అంచనా వేస్తున్న నేపథ్యంలో వరంగల్ పట్టణ జిల్లాకు చెందిన ఈ యువతి కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది.

ఈ ఆడియో క్లిప్పింగ్ బయటకు వచ్చిన తరువాత ఆమె అదృశ్యంకాగా, రాజయ్య వర్గం దాచిందా? లేక కడియం అనుచరుల పనా? అన్న ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. భర్తతో విభేదించిన ఆమె విడిగా ఉంటోందని, ఆర్థిక సమస్యలు తీరేందుకు ప్రభుత్వ పథకాలను ఉపయోగించుకోవచ్చని ఎవరో ఇచ్చిన సలహాను నమ్మి ఆమె రాజకీయ నాయకులను ఆశ్రయిస్తే, వారు ఆమె జీవితంతో ఆడుకున్నారని తెలుస్తోంది.

తొలుత దిగువ శ్రేణి నాయకులతో ఆమెకు ఏర్పడిన పరిచయం పెద్ద నాయకులకు చేరువ చేయగా, ఆమె తన ఫోన్ లో దయాకర్, వెంకటేశ్వర్లు తదితర పేర్లను చెబుతూ, "నువ్వే నా మొగుడివి" అనడంతో కాల్ ముగిసిన సంగతి తెలిసిందే. 5.34 నిమిషాల నిడివి వున్న ఈ ఆడియో ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లాలో హాట్ టాపిక్ గా మారగా, ఆమె ఎక్కడికి వెళ్లిందన్న విషయమై పోలీసులు సైతం ఆరా తీస్తున్నారు.

Warangal Urban District
Audio Clip
Tadikonda Rajaiah
Lady
  • Loading...

More Telugu News