Srikakulam District: వైసీపీకి షాకిచ్చిన మరో నేత.. శ్రీకాకుళంలో టీడీపీలో చేరిన బాబూరావు!

  • మంత్రి అచ్చెన్నాయుడు సమక్షంలో టీడీపీ తీర్థం
  • నిన్న వైసీపీకి రాజీనామా చేసిన బొమ్మిరెడ్డి
  • 2014లో పలాసలో వైసీపీ తరపున వజ్జ పోటీ

వైసీపీ నుంచి వలసలు కొనసాగుతున్నాయి. నెల్లూరు జెడ్పీ చైర్మన్, వెంకటగిరి నియోజకవర్గ ఇన్ చార్జ్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి నిన్న పార్టీని వీడిన కొన్ని గంటల్లోనే మరో నేత వైపీసీకి షాకిచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్, శ్రీకాకుళం నేత వజ్జ బాబూరావు ఈ రోజు ఉదయం టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.

ఏపీ మంత్రి కె. అచ్చెన్నాయుడు ఈ రోజు బాబూరావుకు పార్టీ కండువా కప్పి తెలుగుదేశంలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో లోక్ సభ సభ్యుడు కె.రామ్మోహన్ నాయుడు పలువురు నేతలు పాల్గొన్నారు. 2014లో వైసీపీ తరఫున పలాస అసెంబ్లీ సీటుకు పోటీచేసిన వజ్జ బాబూరావు టీడీపీ అభ్యర్థి గౌతు శ్యామ్ సుందర్ శివాజీ చేతిలో ఓటమి చవిచూశారు.

Srikakulam District
YSRCP
Telugudesam
vajja baburao
  • Loading...

More Telugu News