basara: బావను ప్రేమించి... తప్పు తనదేనని... యువతి ఆత్మహత్య!

  • బాసర ఆర్జీయూకేటీలో చదువుతున్న అనూష
  • బావను ప్రేమించి, ఆపై మనస్పర్థలు
  • బావ తప్పులేదని చెబుతూ సూసైడ్

తన బావను ప్రేమించిన ఓ యువతి, మనస్పర్థల కారణంగా తాను చదువుతున్న బాసరలోని ఆర్జీయూకేటీ కళాశాల రెండో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. మరిన్ని వివరాల్లోకి వెళితే, సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలం మందపల్లికి చెందిన అనూష (18) బాసరలో పీయూసీ విద్యను అభ్యసిస్తోంది. నిన్న మధ్యాహ్నం తోటి అమ్మాయిలంతా భోజనానికి వెళ్లిన సమయంలో భవంతిపై నుంచి కిందకు దూకింది.

ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆమెను, నిజామాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, పక్కటెముకలు విరిగిన కారణంగా తీవ్రగాయాలతో మరణించింది. మరణానికి ముందు అనూష రాసిన సూసైడ్ లెటర్ లోని వివరాల ప్రకారం, ఆమె తన బావ వరుసైన నాగరాజును ప్రేమించింది. ఎందుకో వారిమధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. బావ లేకుండా తాను బతకలేనని, అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నానని చెప్పిన ఆమె, బావ చాలా మంచోడని, తానే తప్పు చేశానని చెప్పింది. నాగరాజును ఏమీ అనవద్దని కోరింది. లేఖను పరిశీలిస్తున్నామని, కేసు దర్యాఫ్తు కొనసాగుతుందని పోలీసులు వెల్లడించారు.

basara
Anusha
Sucide
  • Loading...

More Telugu News