India: ఇలాంటోళ్లను చాలామందినే చూశా: నోరుపారేసుకున్న ఇమ్రాన్ ఖాన్

  • భారత్ నిర్ణయం దురహంకారం
  • గొప్ప స్థానంలో ఉండి లక్ష్యాలు లేని వారెందరో
  • చర్చల రద్దుపై స్పందించిన ఇమ్రాన్ ఖాన్

కాశ్మీర్ లో ఉగ్రవాదులకు మద్దతిస్తూ, సైనికులు, పోలీసుల ప్రాణాలు తీస్తున్న వారికి పాకిస్థాన్ అండగా ఉంటోందని ఆరోపిస్తూ, ఇరు దేశాల మధ్యా జరగాల్సిన చర్చలను భారత్ రద్దు చేసుకున్న నేపథ్యంలో పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ నోరుపారేసుకున్నారు. ఓ వివాదాస్పద ట్వీట్ చేసిన ఆయన, భారత్ నిర్ణయం దురహంకారమని అన్నారు. శాంతి కోసం చర్చలు జరిపేందుకు తాను పిలుపునిస్తే, అందుకు ఇండియా ఇచ్చిన సమాధానం తనను నిరాశపరిచిందని అన్నారు.

ఓ గొప్ప స్థానంలో కూర్చుని, లక్ష్యాలు లేకుండా పనిచేసేవారిని తాను చాలామందినే చూశానని అన్నారు. కాగా, న్యూయార్క్ లో జరగనున్న ఐరాస జనరల్ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఇండియా తరఫున హాజరవుతున్న సుష్మా స్వరాజ్, పాక్ మంత్రి షా మెహ్మూద్ ఖురేషీల మధ్య చర్చలు జరిపేందుకు తొలుత భారత్ అంగీకరించిన సంగతి తెలిసిందే. అయితే, జమ్ము కశ్మీర్ లో ముగ్గురు పోలీసులను అపహరించి, వారిని దారుణంగా హత్య చేసిన నేపథ్యంలో పాక్ తో చర్చలు జరపబోమని ఇండియా స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News