Chandrababu: రాఫెల్ డీల్‌పై స్పందించిన చంద్రబాబు.. మోదీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్

  • హోలండ్ నోరు విప్పడంతో లోగుట్టు బయటపడింది
  • సైనికుల మనోభావాలను మోదీ దెబ్బ తీశారు
  • జాతికి క్షమాపణ చెప్పాల్సిందే

దేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ధ విమానాల డీల్‌పై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. ఫ్రాన్స్ మాజీ అధ్యక్షుడు ఫ్రాంకోయిస్ హోలండ్ నోరు విప్పడంతో లోగుట్టు బయటపడిందని, మోదీ చెబుతున్నదంతా అబద్ధమని తేలిపోయిందని అన్నారు. చేసిన తప్పుకు మోదీ జాతికి క్షమాపణలు చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు. రాఫెల్ డీల్‌తో మోదీ మన సైనికుల మనోభావాలను దెబ్బతీసేలా ప్రవర్తించారని చంద్రబాబు విమర్శించారు. చేసిన తప్పుకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు శనివారం కర్నూలు జిల్లాలో పర్యటించారు. అవుకు జలాశయం నుంచి కడప జిల్లాలోని గండికోట జలాశయానికి నీటిని విడుదల చేశారు. అనంతరం కొలిమిగుండ్లలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రధాని మోదీపై విమర్శనాస్త్రాలు సంధించారు. రాఫెల్‌పై స్పందించారు. చంద్రబాబు ఈ డీల్‌పై స్పందించడం ఇదే తొలిసారి.

Chandrababu
Andhra Pradesh
Rafale
France
Kurnool District
Narendra Modi
  • Loading...

More Telugu News