sivaji: నన్ను టార్గెట్ చేసే ప్రతి ఒక్కరి చరిత్ర బయటపెడతా.. కర్ణాటకలో ఆపరేషన్ ద్రవిడ ప్రారంభమైంది: శివాజీ

  • జగన్, పవన్ లు ముందు ప్రజా సమస్యలను తెలుసుకోవాలి
  • రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలి
  • కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాలు మొదలయ్యాయి

తనను రెచ్చగొట్టే చర్యలను ఆపాలని... లేకపోతే తనను టార్గెట్ చేసే ప్రతి ఒక్కరి చరిత్రను బయటపెడతానని హీరో శివాజీ హెచ్చరించారు. వైసీపీ అధినేత జగన్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లు ముందు ప్రజా సమస్యలను తెలుసుకోవాలని సూచించారు. ఏపీపై కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ గరుడను చేపడుతుందని తాను చెప్పినప్పుడు చాలా మంది తనను విమర్శించారని... ఇప్పుడు అది వాస్తవ రూపం దాల్చిందని చెప్పారు. గుంటూరులో నిర్వహించిన రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవ మహా ర్యాలీలో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు వ్యాఖ్యానించారు.

రాష్ట్ర ప్రభుత్వాలను అస్థిరపరిచే కుట్రలను తిప్పికొట్టాలని ప్రజలకు శివాజీ పిలుపునిచ్చారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను అస్థిరపరచడాన్ని తాను వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఇప్పుడు కర్ణాటకలో ఆపరేషన్ ద్రవిడ ప్రారంభమైందని తెలిపారు. జేడీఎస్-కాంగ్రెస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వాన్ని కూల్చడమే ఈ ఆపరేషన్ లక్ష్యమని చెప్పారు. ఈ కార్యకమంలో మంత్రి నక్కా ఆనందబాబు, ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ కారెం శివాజీ, వర్ల రామయ్య, ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. 

sivaji
operation dravida
operation garuda
jagan
Pawan Kalyan
  • Loading...

More Telugu News