kcr: కేసీఆర్ వంచకుడు.. హరీష్ రావును పొమ్మనలేక పొగపెడుతున్నారు: రఘునందన్ రావు

  • టీఆర్ఎస్ లో ఇంటిపోరు ఎక్కువవుతోంది
  • కారుకున్న టైర్లలో ఒకటి పక్కకు పోతోంది
  • సిద్ధిపేట నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్టు తెలుస్తోంది

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై బీజేపీ అధికార ప్రతినిధి, దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి రఘునందన్ రావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ వంచకుడని, వంచనకు మారుపేరని విమర్శించారు. మంత్రి హరీష్ రావుకు పొమ్మనలేక పొగ పెట్టినట్టు కనిపిస్తోందని చెప్పారు. హరీష్ నియోజకవర్గం సిద్ధిపేట నుంచి కేసీఆర్ పోటీ చేయనున్నట్టు విశ్వసనీయంగా తెలుస్తోందని అన్నారు. టీఆర్ఎస్ లో ఇంటిపోరు ఎక్కువవుతోందని చెప్పారు. కారుకున్న నాలుగు టైర్లలో ఒక టైరు పంక్చరై పక్కకు పోతోందని అన్నారు. అందుకే స్టెప్నీగా కోబ్రదర్ కుమారుడైన సంతోష్ కుమార్ ను దగ్గరకు తీసుకున్నారని...  ఇప్పటికే ఆయనను రాజ్యసభకు పంపారని ఎద్దేవా చేశారు.

 'ఈ జన్మకు ఇది చాలు. మీ ప్రేమాభినాలు ఉన్నప్పుడే రాజకీయాల నుంచి తప్పుకుంటే మంచిదనిపిస్తోంది' అని హరీష్ రావు నిన్న వ్యాఖ్యానించిన నేపథ్యంలో... రఘునందన్ ఈ మేరకు స్పందించారు.  

kcr
raghunandan rao
harish rao
TRS
bjp
siddipet
  • Loading...

More Telugu News