Anushka Sharma: అమితాబ్ అడిగిన ప్రశ్నకు సిగ్గుతో ఎర్రబారిన అనుష్క ముఖం!

  • కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి హాజరైన అనుష్క
  • కోహ్లీ ఫ్లయింగ్ కిస్ లపై ప్రశ్నించిన అమితాబ్
  • అమితాబ్ ప్రశ్నకు సిగ్గుపడ్డ అనుష్క

గత డిసెంబర్ లో ఇండియాలో జరిగిన పెద్ద ఈవెంట్లలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ నటి అనుష్క శర్మ వివాహం ఒకటి. ఇద్దరూ కూడా వారివారి రంగాల్లో బిజీగా ఉంటున్నప్పటికీ... తన భర్తను ఇంటా, బయటా కూడా మిస్ కాకుండా అనుష్క చూసుకుంటోంది. దాదాపు ప్రతి మ్యాచ్ కు అనుష్క హాజరవుతోంది. విదేశాల్లో మ్యాచ్ జరిగే సమయంలో కూడా ఆమె అక్కడకు వెళ్తోంది. మ్యాచ్ ల సందర్భంగా గ్యాలరీలో కూర్చొని తన భర్తను ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు కోహ్లీ కూడా ఏదైనా సాధించినప్పుడు గ్రౌండ్ నుంచి తన భార్యకు ఫ్లైయింగ్ కిస్ లు విసురుతుంటాడు.

ఇదే విషయంపై అనుష్కను బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ ఆటపట్టించారు. కౌన్ బనేగా కరోడ్ పతి కార్యక్రమానికి సామాజిక కార్యకర్త సుధా వర్గీస్ తో పాటు అనుష్క హాజరైంది. ఈ సందర్భంగా ఈ ఫ్లయింగ్ కిస్ ల గురించి అమితాబ్ ప్రశ్నించగా... అనుష్క మొహం సిగ్గుతో ఎరుపెక్కింది. అయితే, సమాధానాన్ని కూడా అంతే కొంటెగా చెప్పింది. తాను కోహ్లీ కోసమే క్రికెట్ ను చూడనని... దేశం కోసం చూస్తానని తెలివిగా సమాధానం ఇచ్చింది. దీంతో అక్కడ నవ్వులు విరబూశాయి.  

Anushka Sharma
Amitabh Bachchan
Virat Kohli
kaun banega krorepati
  • Loading...

More Telugu News