samanta: 'స్త్రీ' మూవీ తెలుగు రీమేక్ .. తెరపైకి సమంత - నిహారిక పేర్లు!

- హిందీలో హిట్ కొట్టేసిన 'స్త్రీ'
- శ్రద్ధా కపూర్ కి మంచి పేరు
- ఆలోచనలో పడిన సమంత
హిందీలో ఈ మధ్యకాలంలో వచ్చిన హారర్ మూవీస్ లో 'స్త్రీ' ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించింది. శ్రద్ధా కపూర్ కి ఈ సినిమా మంచి పేరు తెచ్చిపెట్టింది. అమర్ కౌశిక్ దర్శకత్వంలో శ్రద్ధా కపూర్ .. రాజ్ కుమార్ రావు నటించిన ఈ సినిమా, ఆగస్టు 31వ తేదీన విడుదలై 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోయింది. ఈ సినిమా నిర్మాతలు రాజ్ నిడిమోరు .. కృష్ణ డీకే తెలుగువారే.
