modi: మోదీ మార్ఫింగ్ ఫొటోను పోస్ట్ చేసిన వ్యక్తిపై కేసు నమోదు!
- ఈనెల 14న ఇండోర్ లో దావూదీ బోహ్రాల కార్యక్రమంలో పాల్గొన్న మోదీ
- ఆ సమయంలో స్కల్ క్యాప్ ధరించినట్టు ఫొటో మార్ఫింగ్
- ఐపీసీ సెక్షన్ 505 (2)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు
ప్రధాని మోదీ ఫొటోను మార్ఫింగ్ చేసి, ఫేస్ బుక్ లో పోస్ట్ చేసిన వ్యక్తిపై మధ్యప్రదేశ్ ఇండోర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నెల 14వ తేదీన ఇండోర్ లో దావూదీ బోహ్రా సామాజిక వర్గానికి చెందిన కార్యక్రమంలో పాల్గొన్న మోదీ... వారికి అభివాదాలు తెలియజేస్తున్న సమయంలో స్కల్ క్యాప్ ను ధరించినట్టు మార్ఫింగ్ చేశాడు.
స్థానిక బీజేపీ నేత శంకర్ లాల్వానీ ఫిర్యాదు మేరకు ఐపీసీ సెక్షన్ 505 (2)తో పాటు ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశామని పోలీసు అధికారులు తెలిపారు. బాల్ ముకుంద్ సింగ్ గౌతమ్ ప్రొఫైల్ పేరుతో ఈ ఫొటో షేర్ అయిందని పోలీసులు గుర్తించారు. ఇండోర్ లోని సైఫీ మసీదులో దావూదీ బోహ్రా కమ్యూనిటీకి సంబంధించిన అషారా ముర్బారక కార్యక్రమంలో మోదీ ఎలాంటి టోపీ ధరించలేదని శంకర్ లాల్వానీ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.