Amrapali: జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ ఆమ్రపాలికి ఎన్నికల సంఘం ప్రత్యేక బాధ్యతలు

  • తెలంగాణ రాష్ట్రం సంయుక్త ఎన్నికల ప్రధానాధికారిగా నియామకం
  • ఐటీకి సంబంధించిన వ్యవహారాలు చూడాలని ఆదేశం
  • ఓటు హక్కు వినియోగంపై సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారానికి కసరత్తు

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) అదనపు కమిషనర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమ్రపాలికి కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) కీలక బాధ్యతలు అప్పగించింది. ఆమెను రాష్ట్ర ఎన్నికల సంఘానికి బదిలీ చేసింది. ఎన్నికల నిర్వహణలో ఐటీ సంబంధిత వ్యవహారాలను చూడాలని ఆదేశించింది. ఇటీవల ఐటీ నిపుణులతో సమావేశం నిర్వహించిన సీఈసీ ఫేస్‌బుక్‌లో ప్రత్యేక పేజీని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఓటు హక్కు వినియోగం, వీసీ ప్యాట్లపై ప్రజలకు పూర్తి అవగాహన కలిగించేందుకు డిజిటల్‌, సోషల్‌ మీడియాను పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని యోచిస్తున్న ఎన్నికల సంఘం ఆ బాధ్యతలను చూసేందుకు ఆమ్రపాలిని నియమించింది. ఆమె 2010 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారిణి.

Amrapali
Telangana
EC
  • Loading...

More Telugu News