Balakrishna: విలన్ క్యారెక్టర్లు చేయడానికి కూడా రెడీ: బాలకృష్ణ

  • సైమా వేడుకల్లో ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న బాలయ్య
  • ప్రతినాయక పాత్రలను పోషించేందుకు కూడా సిద్ధమే
  • విలన్ క్యారెక్టర్లు చేస్తే.. అభిమానులు నాపై కేసులు పెడతారేమో

నందమూరి బాలకృష్ణ... తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న నటుడు. ఇప్పటికే వంద సినిమాలను దాటేసిన బాలయ్య... వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ఓ వైపు ప్రజాప్రతినిధిగా, మరో వైపు నటుడిగా రెండు పాత్రలను తనదైన శైలిలో పోషిస్తున్నారు. ప్రస్తుతం 'ఎన్టీఆర్' బయోపిక్ పనుల్లో బిజీగా ఉన్న ఆయన... ఇటీవల జరిగిన సైమా వేడుకల్లో సందడి చేశారు. రానాతో కలసి రెడ్ కార్పెట్ ఎంట్రీ ఇచ్చారు.

ఈ సందర్భంగా బాలయ్య మాట్లాడుతూ, విలన్ పాత్రలను పోషించడానికి కూడా తాను రెడీనే అని చెప్పారు. అయితే, ప్రతినాయక పాత్రలను పోషిస్తే... తన మీద అభిమానులు కేసులు పెడతారేమో అంటూ నవ్వులు పూయించారు. దుబాయ్ లో సైమా వేడుకలు జరిగిన సంగతి తెలిసిందే. 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమాకుగాను ఉత్తమ నటుడిగా క్రిటిక్స్ కేటగిరీలో బాలయ్య అవార్డును అందుకున్నారు.

  • Error fetching data: Network response was not ok

More Telugu News