vanitha: రౌడీలతో దాడి చేయించాడు.. అర్ధరాత్రి ఇంట్లో నుంచి గెంటేశాడు!: నటుడు విజయకుమార్ పై కుమార్తె ఫిర్యాదు

  • వడపళని పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు
  • అర్ధరాత్రి ఇంట్లో నుంచి గెంటేశాడని వెల్లడి
  • ప్రస్తుతం తల్లి ఇంట్లో ఉంటున్నానన్న వనిత

తన ఇంటిని ఆక్రమించుకుని ఖాళీ చేయడం లేదంటూ ప్రముఖ నటుడు విజయకుమార్ తన కుమార్తె వనితపై ఇటీవల ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఇల్లు ఖాళీ చేయమంటే రౌడీలతో బెదిరిస్తోందని ఆయన పోలీసులకు చెప్పారు. దీంతో వనితను విచారించేందుకు పోలీసులు చెన్నైలోని అష్టలక్ష్మీ నగర్‌లోని ఇంటికి వెళ్లగా అధికారులపై అనుచరులతో కలిసి దాడిచేసి పరారయింది. ప్రస్తుతం ఆమె కోసం పోలీసులు గాలిస్తున్న వేళ వడపళనిలోని పోలీస్ స్టేషన్ లో వనిత ప్రత్యక్షమైంది.

తన తండ్రి విజయకుమార్ కిరాయి మనుషులతో తనపై దాడి చేయించాడని పోలీసులకు వనిత ఫిర్యాదు చేసింది. బలవంతంగా అర్ధరాత్రి తనను ఇంట్లో నుంచి గెంటేశారని వాపోయింది. అనంతరం ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ప్రస్తుతం తన తల్లి ఇంట్లో ఉంటున్నట్లు వనిత తెలిపింది. కన్నకూతురని కూడా చూడకుండా అర్ధరాత్రి ఇంటి నుంచి గెంటేశాడని ఆరోపించింది. సినిమా ఆర్టిస్టు కావడంతో తనకు ఎవ్వరూ ఇల్లు అద్దెకివ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది.

vanitha
Tamilnadu
Talking Movies
cinema
kollywood
vijayakumar
Police
  • Loading...

More Telugu News