parauchuri gopalakrishna: 'గీత గోవిందం'లో ఆ సీన్ తో కథ మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది: పరుచూరి గోపాలకృష్ణ
![](https://imgd.ap7am.com/thumbnail/tnews-0db7f3b9bf4e11cbb578e9c239d28d6071c3f2a2.jpg)
- హీరోపై హీరోయిన్ కి చెడు అభిప్రాయం
- అనుకోకుండా అది మరింత బలపడటం
- ఆ తరువాత కోపం .. ప్రేమగా మారడం
ఈ వారం 'పరుచూరి పాఠాలు' కార్యక్రమంలో పరుచూరి గోపాలకృష్ణ 'గీత గోవిందం' సినిమాను గురించి ప్రస్తావించారు. "బస్సులో జరిగిన సంఘటన కారణంగా హీరోపై హీరోయిన్ కి చెడు అభిప్రాయం కలుగుతుంది. హీరో చెల్లెలికి .. హీరోయిన్ అన్నయ్యకి పెళ్లి . ఆ వెడ్డింగ్ కార్డ్స్ ను హీరో హీరోయిన్లు కలిసి పంచుతుంటారు.
ఆ సమయంలోనే హీరో సెల్ ఫోన్లోని ఒక వీడియోను హీరోయిన్ చూస్తుంది. ఆయనపై గల చెడు అభిప్రాయం మరింత బలపడుతుంది. ఈ విషయంలో హీరోయిన్ కి నిజం తెలిసి .. హీరో వ్యక్తిత్వం ఎంత గొప్పదో అర్థమవుతుంది. దాంతో ఆయనను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. ఆ సమయంలో హీరో ఎగిరి గంతేస్తాడని అంతా అనుకుంటారు. కానీ ఆమెను పెళ్లి చేసుకోవడానికి హీరో అంగీకరించకపోవడంతో కథ మరో ఆసక్తికరమైన మలుపు తిరుగుతుంది" అని చెప్పుకొచ్చారు.