charan: నిర్మాతగా చరణ్ .. హీరోగా ఎన్టీఆర్?

  • ఎన్టీఆర్ .. చరణ్ మంచి స్నేహితులు 
  • చరణ్ బ్యానర్లో చేయడానికి ఎన్టీఆర్ ఓకే  
  • మరోపక్క ఈ ఇద్దరూ హీరోలుగా రాజమౌళి మూవీ 

చరణ్ కొణిదెల ప్రొడక్షన్స్ పేరుతో సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యానర్లో తొలి సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఖైదీ నెంబర్ 150' భారీ వసూళ్లను సాధించింది. దాంతో రెండవ సినిమాగా 200 కోట్లకి పైగా బడ్జెట్ తో చరణ్ 'సైరా' సినిమాను నిర్మిస్తున్నాడు. ఇక ఈ బ్యానర్లో మూడవ సినిమా ఎన్టీఆర్ తో ఉంటుందనేది తాజా సమాచారం. తన బ్యానర్లో బయట హీరోలతో కూడా సినిమాలు చేస్తానని చరణ్ ముందుగానే చెప్పాడు. అన్నట్టుగానే ఆయన ఎన్టీఆర్ తో ఒక సినిమాను ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. చరణ్ ఈ సినిమాకి నిర్మాతగా మాత్రమే వ్యవహరిస్తాడట. అంటే ఎన్టీఆర్ హీరోగా మాత్రమే ఈ సినిమా రూపొందనుంది. ఎన్టీఆర్ .. చరణ్ మంచి స్నేహితులు, అందువల్లనే తన బ్యానర్లో చేయమని చరణ్ అడగ్గానే ఎన్టీఆర్ ఓకే అనేశాడని చెప్పుకుంటున్నారు. త్వరలో ఈ విషయంలో స్పష్టత వచ్చే అవకాశం వుంది. ఇదిలా ఉంచితే, మరోపక్క ఈ ఇద్దరూ కలిసి రాజమౌళి మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News