Andhra Pradesh: రాజమహేంద్రవరంలో అర్ధరాత్రి పేలుడు.. మహిళ మృతి, నలుగురి పరిస్థితి విషమం!

  • లాలా చెరువు సమీపంలోని ఇంటిలో పేలుడు 
  • దీపావళికి బాణసంచా తయారుచేస్తుండగా పేలుడు
  • అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు 

రాజమహేంద్రవరంలో శుక్రవారం అర్ధరాత్రి దారుణం జరిగింది. దీపావళి కోసం తయారుచేస్తున్న బాణసంచా ప్రమాదవశాత్తు పేలడంతో ఓ మహిళ మృతి చెందగా, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. నగరంలోని లాలా చెరువు సమీపంలోని తాటాకు ఇంటిలో శుక్రవారం అర్ధ రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో గాయపడిన నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వీరంతా చికిత్స పొందుతున్నారు.

దీపావళి పండుగ కోసం మందుగుండు తయారు చేస్తుండగా పేలుడు సంభవించిందని స్థానికులు చెబుతుండగా, గ్యాస్ సిలిండర్ పేలిందని తీవ్ర గాయాలపాలైన ముత్యాల రెడ్డి తెలిపాడు. పేలుడులో మృతి చెందిన ధనలక్ష్మితో పాటు గాయపడిన కర్రి వైష్ణవి, దేవాడ ముత్యాల రెడ్డి, దుర్గా మణి కుమార్, వినయ్‌రెడ్డి, సూర్యకాంతంలు ఒకే కుటుంబానికి చెందిన వారు. క్షతగాత్రులకు 90 శాతం శరీరం కాలిపోయినట్టు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు పేలుడుకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.

Andhra Pradesh
Rajamahendravaram
Deepavali
blast
  • Loading...

More Telugu News